ట్విటర్‌ తీరు మారలేదు : ప్రభుత్వ వర్గాల వెల్లడి

ప్రధానాంశాలు

Updated : 29/05/2021 05:40 IST

ట్విటర్‌ తీరు మారలేదు : ప్రభుత్వ వర్గాల వెల్లడి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. నూతన డిజిటల్‌ నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాలన్నీ తమ అధికారుల వివరాలను తెలియజేయాలని ఐటీశాఖ ఆదేశించింది. ఇందుకు స్పందించిన గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, కూ, షేర్‌చాట్‌, టెలిగ్రాం, లింక్‌డిన్‌ తదితర వేదికలు నిర్దేశిత వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాయి. ట్విటర్‌ మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ‘‘నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాలు భారత్‌లో తమ సంస్థల్లో పనిచేసే స్థానిక పౌరులను చీఫ్‌ కంపిలియన్స్‌ ఆఫీసర్లు (సీసీవో)గా నియమించాలి. వారి వివరాలను వెల్లడించాలి. చాలా సామాజిక మాధ్యమాలు తమ సీసీవోతో పాటు... నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ (ఎన్‌సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. ట్విటర్‌ మాత్రం సీసీవో వివరాలను వెల్లడించలేదు. పైగా, ఓ సంస్థకు చెందిన న్యాయవాదిని ఎన్‌సీపీ, జీపీగా పేర్కొంది’’ అని అధికారులు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన