బ్రిటన్‌కు మూడో ఉద్ధృతి ముప్పు

ప్రధానాంశాలు

Updated : 10/06/2021 11:56 IST

బ్రిటన్‌కు మూడో ఉద్ధృతి ముప్పు

లండన్‌ ఇంపీరియల్‌ కళాశాల నిపుణుడి హెచ్చరిక

లండన్‌: ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా కేసులు, డెల్టా వైరస్‌ తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే బ్రిటన్‌లో మూడో విడత వైరస్‌ విజృంభణకు అవకాశాలు కనిపిస్తున్నాయని లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్‌ నీల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి రేటు 1.5 నుంచి 1.6గా ఉందని, దీని ప్రకారం ప్రతి 10 మంది నుంచి వైరస్‌ 15 లేదా 16 మందికి సంక్రమిస్తుందని తెలిపారు. బుధవారం బ్రిటన్‌లో కొత్తగా 7,560 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి చివరిలో నమోదైన కేసుల కన్నా ఈ సంఖ్య అధికం. డెల్టా రకం వైరస్‌ ప్రబలంగా ఉన్నందున తాజా నమూనాలు మూడో ఉద్ధృతిని చూస్తున్నాయని ఫెర్గూసన్‌ అభిప్రాయపడ్డారు. అయితే, మూడో విడత తీవ్రత రెండో దాని కన్నా అధికంగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా అన్నది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. టీకాలు ఎంత బాగా రక్షణ కల్పించగలవు అన్నది కూడా కీలకాంశమేనని తెలిపారు. అన్‌లాక్‌ ప్రక్రియను మరికొంత కాలం వాయిదా వేయడం, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా మూడో ఉద్ధృతి ప్రారంభాన్ని జాప్యం చేయవచ్చన్నారు. ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న వారిలో, టీకాలు వేయించుకున్న వారిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) సిద్ధంగా ఉంటాయి కనుక వైరస్‌ తీవ్రత తగ్గవచ్చని అభిప్రాయపడ్డారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన