తాహతుకు మించి పెళ్లాడాం!
close

ప్రధానాంశాలు

Updated : 11/06/2021 04:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాహతుకు మించి పెళ్లాడాం!

బ్రిటన్‌ ప్రధానిపై బైడెన్‌ జోక్‌
అవునంటూ తలూపిన జాన్సన్‌

కార్బిస్‌ బే (ఇంగ్లాండ్‌): ఎవరైనా కొత్తగా పెళ్ళయిన వారు ఎదురైతే ఏం చేస్తాం? శుభాకాంక్షలు చెబుతాం! రాలేకపోయామనో... పెళ్ళి బాగా జరిగిందా అనో... యోగక్షేమాలు అడుగుతాం! కానీ... ముచ్చటగా ఇటీవలే మూడో పెళ్ళి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ను తొలిసారి కలిసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎలా పలకించారో తెలుసా? ‘‘మనమిద్దరం తాహతుకు మించి పెళ్ళి చేసుకున్నాం!’’ అంటూ జాన్సన్‌పై జోకేశారు బైడెన్‌ (తనది కూడా రెండో పెళ్ళి)! జి-7 దేశాల సదస్సులో పాల్గొనటానికి గురువారం ఇంగ్లాండ్‌ చేరుకున్న బైడెన్‌ తన తొలి విదేశీ పర్యటనను ఉల్లాసంగా ఆరంభించారు. బైడెన్‌ దంపతులిద్దరూ... కలసి... బోరిస్‌ జాన్సన్‌ దంపతులను కలసుకున్నారు. 56 ఏళ్ళ జాన్సన్‌ ఇటీవలే 33 ఏళ్ళ సిమండ్స్‌ను పెళ్ళాడారు. అందుకే కలసిన వెంటనే బైడెన్‌- జాన్సన్‌ను ఆటపట్టించారు. ‘‘మనిద్దరికీ ఓ సారూప్యముంది. అదేంటంటే... ఇద్దరమూ మన తాహతుకుమించిన వారిని పెళ్ళాడటమే’’ అంటూ బైడెన్‌ నవ్వేశారు. దీంతో... జాన్సన్‌ కూడా ‘‘నేను మీతో ఈ విషయంలో విభేదించటం లేదు... ఈ విషయంలోనే కాదు... ఏ విషయంలోనూ’’ అంటూ నవ్వేశారు!
కొత్త అట్లాంటిక్‌ చార్టర్‌పై సంతకం
గురువారం ముఖాముఖి చర్చలకు ముందు ఈ ఇద్దరు నేతలూ... 80 సంవత్సరాల కిందట రెండో ప్రపంచ యుద్ధ సమయంలో... అప్పటి బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌, అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌లు సంతకం చేసిన అట్లాంటిక్‌ చార్టర్‌ దస్తావేజులను తిలకించారు. ఆ చార్టర్‌ స్ఫూర్తితో... కొత్త అట్లాంటిక్‌ చార్టర్‌పై బైడెన్‌, జాన్సన్‌లు సంతకాలు చేశారు.
మా ఆయన అతిగా సిద్ధమయ్యారు!
బైడెన్‌తో కలసి ఈ పర్యటనకు వచ్చిన ఆయన భార్య జిల్‌ బైడెన్‌ అందరినీ ఆకర్షించారు. ఉత్సాహంగా విలేకరులతో మాట్లాడిన జిల్‌ ‘‘మా ఆయన ఈ పర్యటన గురించి అతిగా తయారై వచ్చారు. జి-7, యూరప్‌ నేతలు... చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం గురించి ఆయన ఎంతో సన్నద్ధమయ్యారు. కొద్ది వారాలుగా చదివేది చదువుతున్నారు... విదేశాంగ విధానమంటే... ఆయనకు ఎంతో ఇష్టం’’ అంటూ వివరించారు. ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 సమావేశం శుక్రవారం నుంచి జరుగుతుంది. ఆ తర్వాత జెనీవాలో వచ్చేవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బైడెన్‌ సమావేశమవుతారు.

జి-7 సదస్సులో మోదీ


దిల్లీ: జి-7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నారు. శని ఆదివారాల్లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నారు. బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్న ఈ కూటమి సమావేశాలు శుక్రవారం ఆరంభం కానున్నాయి. ఆతిథ్య బ్రిటన్‌.. ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలను పిలిచింది. కరోనా పరిస్థితుల దృష్యా మోదీ.. బ్రిటన్‌ వెళ్లరని గత నెలలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన