LPG: ఇక ఏ డీలర్‌ నుంచైనా గ్యాస్‌
close

ప్రధానాంశాలు

Updated : 11/06/2021 13:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LPG: ఇక ఏ డీలర్‌ నుంచైనా గ్యాస్‌

ఇష్టం వచ్చిన వారి దగ్గర బుక్‌ చేసుకునే వీలు
5 నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు

ఈనాడు, దిల్లీ: కంపెనీని మార్చకుండా డీలరును ఎంచుకునే సౌలభ్యం వంట గ్యాస్‌ వినియోగదారులకు కలగనుంది. గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ పోర్టబిలిటీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం వినియోగదారుడు ఏ డిస్ట్రిబ్యూటర్‌ దగ్గర గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకొని ఉంటే వారి దగ్గరే సిలిండర్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక ముందు వినియోగదారుడు తనకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి బుక్‌ చేసుకొనే వెసులుబాటును కేంద్ర పెట్రోలియం శాఖ అందుబాటులోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తొలుత చండీగఢ్‌, కోయంబత్తూరు, గురుగ్రాం, పుణే, రాంచీ నగరాల్లో అమలు చేయనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నూతన విధానం లక్ష్యం.
అమలు విధానం....
* వినియోగదారుడు తన రిజిష్టర్డ్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయి మొబైల్‌యాప్‌, కస్టమర్‌ పోర్టల్‌ నుంచి గ్యాస్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు డిస్ట్రిబ్యూటర్ల పనితీరును చాటిచెప్పే రేటింగ్స్‌ను సూచిస్తూ ఒక జాబితా ప్రత్యక్షమవుతుంది.
* రీఫిల్‌ బుకింగ్‌కు అందులో మంచి రేటింగ్స్‌ ఉన్న డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకొనే స్వేచ్ఛ వినియోగదారుడికి ఉంటుంది.
* చమురు సంస్థల పోర్టళ్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా వినియోగదారులు సిలిండర్‌ బుక్‌ చేసుకోవడంతోపాటు, వ్యక్తిగత రికార్డులను నవీకరించుకోవచ్చు.
* డిజిటల్‌ మార్గంలోనే పోర్టబిలిటీకి దరఖాస్తు చేయొచ్చు.
* కనెక్షన్‌ బదిలీ, చిరునామా మార్పు, రీఫిల్‌కు సంబంధించిన ఇతరత్రా సేవలు పోర్టల్‌, యాప్‌ ద్వారా కొనసాగించవచ్చు.
* ఒకే ప్రాంతంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌ నుంచి మరో డిస్ట్రిబ్యూటర్‌కు కనెక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసుకోవచ్చు.
* వినియోగదారుడు రిజిష్టర్డ్‌ లాగిన్‌ ద్వారా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల జాబితాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లలో ఎవర్నో ఒకర్ని ఎంచుకొని తమ కనెక్షన్‌ను అక్కడికి మార్చుకోవచ్చు.
* ఇదే సమయంలో వినియోగదారుడు వదిలి వెళ్లిపోకుండా వారికి నచ్చజెప్పే అవకాశం కూడా డిస్ట్రిబ్యూటర్‌కు ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడు సంతృప్తి చెందితే తమ పోర్టబిలిటీ దరఖాస్తును మూడు రోజుల్లోపు ఉపసంహరించుకోవచ్చు. లేదంటే కనెక్షన్‌ ఆటోమేటిక్‌గా వినియోగదారుడు ఎంచుకున్న డిస్ట్రిబ్యూటర్‌కు బదిలీ అయిపోతుంది.
* వినియోగదారుడు డీలరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ ప్రాంతంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్‌ (ఒకే కంపెనీకి చెందినవారు)ని ఎంచుకోవచ్చు.
* ఈ సేవలు పూర్తిగా ఉచితమే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 28
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1621231419270-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 165
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 232
            [script_flag] => DEF
            [script_page] => 4
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 1
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] =>  [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

)
మరిన్ని

దేవతార్చన