పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు
close

ప్రధానాంశాలు

Updated : 16/06/2021 05:17 IST

పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు

మైనార్టీ తీరాలని షెల్టర్‌ హోంకు పంపిన హైకోర్టు 

అలహాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాద్‌ హైకోర్టు ముందుకు ఓ వింతకేసు వచ్చింది. పదహారేళ్ల బాలుడిని తమ సంరక్షణలో ఉండేలా అనుమతించాలంటూ ఇటు తల్లి, అటు ‘భార్య’ కోర్టు ముంగిటకు వచ్చారు. మైనర్‌ వివాహం చెల్లుబాటు కాదు కాబట్టి, తల్లి వెంట వెళ్లమంటే బాలుడు ససేమిరా అంటూ పెళ్లామే కావాలంటాడు. ఈ కోరిక మన్నిద్దామంటే.. ఓ మైనర్‌ బాలుడు మేజర్‌ యువతితో సహజీవనం చేస్తే పోక్సో చట్టం ప్రకారం నేరం అవుతుంది. ఈ సందిగ్ధావస్థకు ఓ పరిష్కారం చూపుతూ బాలుడికి మైనారిటీ తీరేదాకా అంటే.. 2022 ఫిబ్రవరి 4వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మైనార్టీ తీరాక అతడు తన ఇష్టప్రకారం ఎవరితోనైనా ఉండవచ్చని కూడా స్పష్టం చేశారు. ఆజంగఢ్‌కు చెందిన బాలుడి తల్లి దాఖలు చేసిన పిటిషనుపై విచారణ జరిపిన జస్టిస్‌ జేజే మునీర్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 18న ఈ కేసు కోర్టుకు రాగా, న్యాయమూర్తి బాలుడి అభిప్రాయం రికార్డు చేశారు. మే 31న తుదితీర్పు వెలువరించగా.. రెండు వారాల అనంతరం కోర్టు వెబ్‌సైటులో పెట్టారు. మరో విశేషం ఏమిటంటే.. మేజర్‌ యువతితో బాలుడి సాంగత్యం కారణంగా వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన