వ్యాక్సిన్లన్నీ సురక్షితమే..
close

ప్రధానాంశాలు

Updated : 16/06/2021 11:46 IST

వ్యాక్సిన్లన్నీ సురక్షితమే..

మరణాలు 0.0002% మాత్రమే..
వాటన్నింటికీ టీకాయే కారణమని చెప్పలేం
కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌ వ్యాక్సిన్లన్నీ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్‌ వల్ల సంభవిస్తున్న మరణాలతో పోలిస్తే.. వ్యాక్సినేషన్‌ తర్వాత మరణాల ముప్పు నామమాత్రమేనని పేర్కొంది. ఈమేరకు దిల్లీలో మంగళవారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీకాల కారణంగా ప్రతికూల ప్రభావం అత్యల్పస్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘దేశంలో జనవరి 16 - జూన్‌ 7 మధ్య 23.5 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వగా.. అదే సమయంలో వ్యాక్సినేషన్‌ తర్వాత మరణాలకు దారితీసిన సంఘటనలు 488 ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇలా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అనంతర పరిణామాల్లో మరణాల రేటు.. ఇచ్చిన డోసులను బట్టి చూస్తే 0.0002% మాత్రమే. పైగా ఈ మరణాలన్నింటికీ వ్యాక్సినేషనే కారణమని కూడా నిర్ధారణగా చెప్పలేం. ఇతరత్రా అనారోగ్య సమస్యలు, బహుళ కారణాలు ఉండొచ్చు. ఈ మరణాలపై జిల్లాస్థాయిలో ఇమ్యునైజేషన్‌ అధికారులు పూర్తిస్థాయిలో విశ్లేషించి కారణం వ్యాక్సినేషనా? ఇంకేదైనా ఉందా? అని నిర్ణయిస్తారు. యుద్ధంలో ఆయుధం లాంటి వ్యాక్సిన్‌ను అందరూ తీసుకోవాలి. ప్రస్తుతం కొవిడ్‌ మరణాల రేటు 1%కి మించి ఉంది. వ్యాక్సిన్లు తీసుకుంటే ఆ మరణాలనూ తగ్గించవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ప్రతికూల ప్రభావం కనిపించిన ప్రతి కేసుపైనా అందుకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నాం. ఒకసారి వీటిపై విచారణ పూర్తయిన తర్వాత వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తాం’’ అని వివరించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్ల పనితీరుపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. దేశంలో ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్లతోపాటు, భవిష్యత్తులో అనుమతులిచ్చే సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజారోగ్యం విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు భారీసంఖ్యలో ప్రాణాలకు భద్రత కల్పించే ఉద్దేశంతోనే తీసుకుంటామన్నారు. అందువల్ల ముప్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. ఎవ్వరూ దీనిపై అపోహలు సృష్టించొద్దని కోరారు. సాధారణంగా ఏ వ్యాక్సిన్లతోనైనా అత్యంత స్వల్పస్థాయిలో దుష్ప్రభావాలు ఉంటాయని.. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఇప్పటివరకు ఎదురైన అనుభవాన్ని బట్టి ముప్పు దాదాపు లేనట్లే చూడాలన్నారు. రెండో ఉద్ధృతిలో యువతపై కరోనా అధిక ప్రభావం చూపిందన్న అపోహలు సృష్టించారని, అందులో నిజం లేదన్నారు.

టీకా తర్వాత తీవ్ర అలర్జీలతో తొలి మరణం
దేశంలో కొవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత తీవ్ర అలర్జీల ప్రభావం (అనాఫిలేక్సిస్‌)తో తొలి మరణం సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయన బృందం ఒకటి పేర్కొంది. ఇమ్యునైజేషన్‌ అనంతరం తీవ్ర దుష్ప్రభావ సంఘటనల(ఏఈఎఫ్‌ఐ)పై ఈ జాతీయ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు 68 ఏళ్ల వ్యక్తి ఒకరు మార్చి 8న టీకా తీసుకున్న తర్వాత తీవ్ర అలర్జీల ప్రభావంతో చనిపోయినట్లు ఏఈఎఫ్‌ఐ కమిటీ ఓ నివేదికలో తెలిపింది. ‘‘వ్యాక్సినేషన్‌తో సంబంధం ఉన్న.. అనాఫిలేక్సిస్‌తో ఇదే తొలి మరణం. టీకా వేసుకున్న తర్వాత దుష్ప్రభావాల పరిశీలన కోసం 30 నిమిషాల పాటు వ్యాక్సినేషన్‌ కేంద్రంలోనే ఉండాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోంది. అ సమయంలో తీవ్ర అలర్జీలకు గురైతే వెంటనే చికిత్స అందించడం ద్వారా మరణ ముప్పును నిరోధించవచ్చు’’ అని ఏఈఎఫ్‌ఐ జాతీయ కమిటీ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌.కే.ఆరోడా తెలిపారు. ఈ కమిటీ ఇలాంటి 31 కేసులను గుర్తించింది. ఇందులో 18 కేసులు కాకతాళీయమని.. వీటికి వ్యాక్సినేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. మరో 7 కేసులు నిర్ధారితం కానివని, 3 కేసులు టీకా ఉత్పత్తి సంబంధమైనవని, ఒకటి ఆందోళనకు సంబంధించిన ప్రభావమని, 2 కేసులు వర్గీకరించలేనివని ప్రభుత్వ కమిటీ నివేదికలో పేర్కొంది. కాగా ఇద్దరు వ్యక్తులు జనవరిలో అనాఫిలేక్సిస్‌కు గురై ఆసుపత్రి పాలైనప్పటికీ తర్వాత కోలుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ తొలివారం నాటికి అందిన సమాచారం ప్రకారం ప్రతి 10 లక్షల టీకా డోసులకు 2.7 మరణాలు, 4.8 ఆసుపత్రిలో చేర్చాల్సిన సంఘటనలు బయటపడినట్లు నివేదిక పేర్కొంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన