రెండు నెలలగా ఆకలితో అలమటించి.. ఆసుపత్రిపాలై..

ప్రధానాంశాలు

Updated : 17/06/2021 10:15 IST

రెండు నెలలగా ఆకలితో అలమటించి.. ఆసుపత్రిపాలై..

ఐదుగురు పిల్లలతో కూడిన ఆ కుటుంబం కడు పేదరికంతో రెండు నెలల పాటు ఆకలితో అలమటించింది. దాంతో తీవ్ర అనారోగ్యానికి గురవగా స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ కుటంబంలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిదారక ఘటన ఉతర్‌ప్రదేశ్‌లోని మల్కాన్‌సింగ్‌ జిల్లా అలీగఢ్‌లో జరిగింది. గుడ్డీ అనే 40 ఏళ్ల మహిళకు అజయ్‌(20), విజయ్‌(15), తీతు(10), సుందర్‌ రామ్‌(5), అనురాధ(3) అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. గతేడాది ఆమె భర్త వినోద్‌ చనిపోయారు. అప్పటి నుంచి ఆమె ఓ ఫ్యాక్టరీలో నెలకు రూ.4 వేల జీతానికి పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు అజయ్‌ కూలి పనిచేసేవాడు. లాక్‌డౌన్‌తో ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. చుట్టుపక్కల వారు ఆహారాన్ని అందించినా అది సరిపోయేది కాదు. నీళ్లుతాగే బతుకీడ్చారు. రోజుల తరబడి కడుపునకు తిండి లేక కట్టెల్లా మారిపోయారు. ఒంట్లో శక్తిలేక తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన