కరోనాతో సుదీర్ఘ పోరాటం.. కన్నీళ్లతో ప్రాణత్యాగం..
close

ప్రధానాంశాలు

Published : 21/06/2021 04:21 IST

కరోనాతో సుదీర్ఘ పోరాటం.. కన్నీళ్లతో ప్రాణత్యాగం..

14 నెలల పాటు ఆసుపత్రిలో ఉన్న
  బ్రిటన్‌ వాసి కెల్క్‌ కన్నుమూత

లండన్‌: కరోనాతో సుదీర్ఘ కాలం పోరాడిన ఆ యోధుడు అలసిపోయాడు. బయటి ప్రపంచానికి దూరంగా ఆసుపత్రిలోని నాలుగు గోడలకే పరిమితమైన ఆ వ్యక్తి.. ఇక జీవన్మరణ పోరాటం చేయలేనంటూ విరమించుకున్నాడు. స్వచ్ఛందంగా చికిత్స నుంచి తప్పుకుని తనువును వదిలేశాడు. బ్రిటన్‌కు చెందిన 49 ఏళ్ల  జేసన్‌ కెల్క్‌ దీనగాథ ఇది. కెల్క్‌ బ్రిటన్‌లో అత్యధిక కాలం(14 నెలలు) కరోనాతో పోరాడిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. గతేడాది మార్చి 19న ఆయన కొవిడ్‌తో లీడ్స్‌లోని సెయింట్‌ జేమ్స్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే టైప్‌ 2 డయాబెటిస్‌, ఆస్థమాతో బాధపడుతున్న కెల్క్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కరోనా ధాటికి ఆయన ఊపిరితిత్తులు, కిడ్నీలు  దెబ్బతిన్నాయి. కడుపునకు సంబంధించి కూడా పలు సమస్యలు తలెత్తడంతో ఇంజక్షన్ల ద్వారా ద్రవ ఆహారాన్ని అందించాల్సి వచ్చింది. గత ఏప్రిల్‌లో ఆయన్ను ఐసీయూలోకి  మార్చి చికిత్స కొనసాగించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన పరిస్థితి కాస్త మెరుగైనట్లు కనిపించింది.  వెంటిలేటర్‌ కూడా తీసేశారు.  ఇంటికి తిరిగొస్తాడన్న ఆనందంతో ఆయన కుటుంబ సభ్యులు అందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మే నెలలో మళ్లీ ఆయన అనారోగ్యం తిరగబెట్టింది. తిరిగి వెంటిలేటర్‌ పెట్టాల్సి వచ్చింది. తాను కోలుకుంటానన్న ఆశ రోజురోజుకూ సన్నగిల్లడం, ఇంకెన్నాళ్లు ఇలా ఆసుపత్రిలో ఉండాలన్న ఆవేదన ఆయన్ను కుంగదీసింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. తనకు చికిత్స నిలిపివేయాలని వైద్యులను కోరారు. కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో ఆయనకు చికిత్స ఆపేశారు. ఈక్రమంలోనే ఆదివారం భార్య సూ కెల్క్‌, తల్లిదండ్రులు, సోదరి అశ్రు నయనాలతో చూస్తుండగా తుది శ్వాస విడిచారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన