రాష్ట్ర హోదానా.. స్థానాల పునర్విభజనా!
close

ప్రధానాంశాలు

Updated : 21/06/2021 05:27 IST

రాష్ట్ర హోదానా.. స్థానాల పునర్విభజనా!

24న మోదీతో భేటీపై ఉత్కంఠ
కశ్మీర్లో నియోజకవర్గాల సరిహద్దులపై కసరత్తు
370 పునరుద్ధరణకు అవకాశమే లేదంటున్న ప్రభుత్వ వర్గాలు

దిల్లీ, జమ్ము, శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ రాజ్యాంగ అధికరణాన్ని పునరుద్ధరించే అవకాశం లేదని తేల్చి చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌కు చెందిన పార్టీల నేతలతో ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర హోదాపై పలు రకాల వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మునుపటి జమ్మూ-కశ్మీర్‌ను పునర్విభజించిన తర్వాత తొలిసారిగా శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందుగా నియోజకవర్గాల సరిహద్దుల్ని ఖరారు చేయడానికి ప్రభుత్వ కసరత్తు మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. దానిపై రాజకీయ అభిప్రాయం తెలుసుకోవడమే అఖిలపక్షం ఉద్దేశమని చెప్పాయి. రాష్ట్ర హోదాను తగిన సమయంలో పునరుద్ధరిస్తామని గతంలో కేంద్రం చెప్పింది. ఆ సమయం ఇంకా రాలేదని కొన్నివర్గాలు చెబుతున్నాయి. 24నాటి సమావేశంలో ఒకవేళ రాష్ట్ర హోదా అంశం చర్చకు వచ్చినా ఆ అంశంపై మళ్లీ పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.

ఎన్నికల తంతుకు శ్రీకారం

జమ్మూ-కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజనకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.పి.దేశాయ్‌ అధ్యక్షతన ఒక సంఘాన్ని గత ఏడాదే నియమించారు. సెగ్మెంట్లపై ప్రాథమిక సమాచారాన్ని జిల్లాల నుంచి ఆ సంఘం తీసుకుంది. భౌగోళిక సరిహద్దులపై త్వరలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. కసరత్తు పూర్తయ్యాక జమ్ము, కశ్మీర్‌లలో శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి చేరుతుంది. 24 స్థానాలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండడం వల్ల అవి ఖాళీగా మిగులుతాయి. జమ్ము ప్రాంతంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని చాలాకాలం నుంచి డిమాండ్‌ ఉంది. పెరగబోయే ఏడు సెగ్మెంట్లలో నాలుగు జమ్ములో, మూడు కశ్మీర్‌లో ఉంటాయి. అఖిలపక్ష సమావేశానికి 14 పార్టీలను ఆహ్వానించారు. రాష్ట్ర విభజన తర్వాత జమ్ము, కశ్మీర్‌ నేతలతో ప్రధాని నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విధివిధానాలను ప్రధాని దీనిలో చర్చిస్తారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ల లెఫ్టినెంట్‌ గవర్నర్లు విడివిడిగా భేటీ అయ్యారు.

రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు

జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. అఖిలపక్షానికి కాంగ్రెస్‌ హాజరయ్యేదీ లేనిదీ స్పష్టంచేయలేదు. దిల్లీ నుంచి కాకుండా రాష్ట్రం నుంచే పాలన సాగాలని జమ్మూకశ్మీర్‌ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రధానితో జరిగే సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలనే విషయమై సీనియర్‌ నేతలతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సమాలోచనలు జరిపారు.

కేంద్రం ఆహ్వానంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీకే అప్పగిస్తూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సంఘం తీర్మానించింది.

* ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’ (పీఏజీడీ) మంగళవారం సమావేశమై అఖిలపక్ష భేటీపై తుది నిర్ణయం తీసుకోనుంది.

కశ్మీర్‌ను బుజ్జగించే విధానాలను కేంద్రం అనుసరిస్తోందని ఆరోపిస్తూ జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ ఆదివారం జమ్ములో ప్రదర్శన నిర్వహించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన