రూ.4 లక్షలు ఇవ్వకూడదని నిర్ణయించారా?
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 10:06 IST

రూ.4 లక్షలు ఇవ్వకూడదని నిర్ణయించారా?

ఎన్‌డీఎంఏలో తీర్మానం చేశారా?
కరోనా పరిహారంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

దిల్లీ: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల వంతున పరిహారం చెల్లించకూడదని ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాని ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ(ఎన్‌ఎండీఏ)లో ఈ మేరకు తీర్మానం చేశారా? అని అడిగింది. పరిహారం చెల్లించడం ఆర్థిక సామర్థ్యానికి మించిన వ్యవహారమంటూ ప్రమాణ పత్రంలో తెలిపిన కేంద్రం దీనిపై వివరణ ఇచ్చింది. ‘‘దీనర్థం ప్రభుత్వం వద్ద నిధులు లేవని కాదు. ఇలా పరిహారం ఇస్తే ఉన్న నిధులను వైద్యరంగ మౌలిక వసతుల కల్పన, అందరికీ ఆహారం అందజేత, దేశ ప్రజలందరికీ టీకాల పంపిణీ, ఆర్థిక రంగ ఉద్దీపనలకు కాకుండా ఇతర పనులకు వెచ్చించినట్టు అవుతుందన్నదే ఉద్దేశం’’ అంటూ తెలిపింది. దీనిపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ‘‘వివరణ ఇవ్వడం మంచిదయింది. కేంద్రం వద్ద నిధులు లేవంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండేవి’’ అని వ్యాఖ్యానించింది. విపత్తు యాజమాన్య చట్టంలోని సెక్షన్‌ 12 ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉందని, దానిని ఆర్థిక సంఘం తోసిపుచ్చలేదని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇస్తూ పరిహారం విషయమై ఎన్‌డీఎంఏ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలియదని అన్నారు. విపత్తు నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం శాఖ సమన్వయ సంస్థగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనాతో చనిపోయిన వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని, దీనిని సరళీకృతం చేయాలని ధర్మాసనం సూచించింది. సంక్షేమ పథకాలు అందుకోవడానికి వీలుగా ఇప్పటికే ఇచ్చిన ధ్రువపత్రాల్లో అవసరమైతే మార్పులు చేయాలని తెలిపింది. పరిహారం మంజూరులో ఎవరికీ నష్టం కలగకుండా  చూడాలని సూచించింది. పరిహారం చెల్లింపులో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన మార్గదర్శకాలు లేవని తెలిపింది. ఒకరికి పరిహారం వచ్చి, మరొకరికి రాకుంటే గుండెలు మండే పరిస్థితి ఉంటుందని అభిప్రాయపడింది. దీనిపై ఎన్‌డీఎంఏ నిర్ణయం తీసుకుంటుందని తుషార్‌ మెహతా తెలిపారు. శ్మశానాల్లో పనిచేస్తున్న వారికి కూడా కొవిడ్‌ బీమా వర్తింపజేయాలని న్యాయస్థానం చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన