కరోనా వేళ.. యోగా ఓ ఆశాకిరణం
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 13:43 IST

కరోనా వేళ.. యోగా ఓ ఆశాకిరణం

ప్రధాని మోదీ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి వేళ.. ప్రపంచానికి యోగా ఒక ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ అదృశ్య శక్తితో పోరాడగలమన్న ఆత్మవిశ్వాసాన్ని యోగా కల్పించిందని తెలిపారు. 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘కరోనా అదృశ్య వైరస్‌ తొలిసారి కనిపించినప్పుడు ప్రపంచంలో ఏ దేశమూ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. అలాంటి కఠిన సమయంలో యోగా ఆత్మబల మాధ్యమంగా మారింది. ఈ రోగంతో పోరాడగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించింది. వైద్యసిబ్బంది, డాక్టర్లతో మాట్లాడినప్పుడు వారు యోగాను ఓ సురక్షా కవచంగా మార్చుకున్నట్లు చెప్పారు. వైద్యులు యోగా ద్వారా సొంతంగా లబ్ధిపొందడంతోపాటు, రోగులుకూడా ప్రయోజనం పొందేలా చేశారు. మన శ్వాస వ్యవస్థకు దీనిద్వారా ఎంతో శక్తి లభిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నిపుణులు చెప్పారు. ఈరోజు మెడికల్‌ సైన్స్‌కూడా వైద్యం అందించడంతోపాటు, ఉపశమనం కల్పించడంపైనా అంతే దృష్టిపెట్టింది. అనారోగ్యం నుంచి ఉపశమనం కల్పించడానికి యోగా అంతే ఉపకరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో యోగా ఆశా కిరణంగా మారింది’’ అని మోదీ అన్నారు.

డబ్ల్యూహెచ్‌వోతో కలిసి ‘ఎం-యోగా’

డబ్ల్యూహెచ్‌వోతో కలసి ‘ఎం-యోగా’ యాప్‌ను భారత్‌ తేనున్నట్లు మోదీ తెలిపారు. ‘ఒకే ప్రపంచం..ఒకే ఆరోగ్యం’ ప్రయత్నాలకు ఈ యాప్‌ ఊతమిస్తుందని వెల్లడించారు. ‘‘ఈరోజు భారత్‌, డబ్ల్యూహెచ్‌వో కలిసి ఒక ముఖ్యమైన అడుగువేసి మొబైల్‌ యోగా యాప్‌ అందుబాటులోకి తెస్తున్నాయి. ఎన్నో భాషల్లో యోగా శిక్షణకు సంబంధించిన ప్రొటోకాల్స్‌, వీడియోలను దీనిద్వారా ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా యోగాను విస్తరించడానికి ఈ మొబైల్‌ యాప్‌ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు.

మానసిక సంతులనానికి యోగా: ఉప రాష్ట్రపతి

శారీరక.. మానసిక సంతులనాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయుక్తం అవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తన సతీమణి ఉషమ్మతో కలిసి సోమవారం ఆయన యోగ సాధన చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన