సంస్కరణల అమలుతో.. ఖజానా కళకళ
close

ప్రధానాంశాలు

Published : 23/06/2021 04:28 IST

సంస్కరణల అమలుతో.. ఖజానా కళకళ

ప్రధాని మోదీ వెల్లడి

దిల్లీ: కరోనా సంక్షోభ కాలంలో రాష్ట్రాలు పలు ఆర్థిక సంస్కరణలను అమలు చేసిన తీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. సంస్కరణల అమలుతో 23 రాష్ట్రాలు అదనంగా రూ.1.06 లక్షల కోట్ల రుణాలను సమకూర్చుకోగలిగాయని పేర్కొన్నారు. కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ‘‘దృఢ విశ్వాసం, ప్రోత్సాహకాలతో సంస్కరణలు’’ పేరుతో ప్రముఖ సామాజిక మాధ్యమం- లింక్డ్‌ఇన్‌లో ప్రధాని మంగళవారం ఓ పోస్ట్‌ పెట్టారు. వివరాలు ఆయన మాటల్లోనే..

కొవిడ్‌ నేపథ్యంలో 2020-21లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కానీ అదే సమయంలో మన దేశంలోని రాష్ట్రాలు రూ.1.06 లక్షల కోట్ల రుణాలను అదనంగా అందుకోగలిగాయి. కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది. కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా మేం రూపొందించిన ప్రణాళికలు ఇందుకు దోహదపడ్డాయి. ‘అందరికీ ఒకే విధానం’ అన్న గంపగుత్త విధానాన్ని మేం అనుసరించలేదు. రాష్ట్రాలు తమ స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో అదనంగా మరో రెండు శాతం మేర రుణాలను తీసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించాం. అందులో సగాన్ని (ఒక శాతం).. నాలుగు నిర్దేశిత ఆర్థిక సంస్కరణలను అమలుచేస్తేనే పొందేలా షరతులు విధించాం. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తే రాష్ట్రాలకు అదనపు నిధులు అందిస్తామంటూ చెప్పడం భారత ఆర్థిక వ్యవస్థలో అరుదైన పరిణామం.

ఆ నాలుగు సంస్కరణలతో..

మేం ప్రతిపాదించిన సంస్కరణల్లో మొదటిది.. ‘ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ విధానం. 17 రాష్ట్రాలు దాన్ని సంపూర్ణంగా అమలు చేశాయి. రూ.37,600 కోట్ల అదనపు రుణాలు పొందేలా వాటికి అనుమతులిచ్చాం. సులభతర వాణిజ్యానికి సంబంధించిన రెండో సంస్కరణను 20 రాష్ట్రాలు పూర్తిచేసి, రూ.39,521 కోట్లను అదనంగా పొందాయి. ఆస్తి పన్ను, నీటి రుసుములకు సంబంధించిన మూడో సంస్కరణ 11 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. వాటికి రూ.15,957 కోట్ల అదనపు నిధుల అనుమతులు మంజూరయ్యాయి. రైతులకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి బదులు ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టడం నాలుగో సంస్కరణ. దాన్ని అమలుచేయడం ద్వారా 13 రాష్ట్రాలు రూ.13,201 కోట్ల అదనపు రుణాలకు అనుమతి పొందాయి. సంస్కరణల అమలుతో మొత్తంగా రూ.2.14 లక్షల కోట్ల అదనపు నిధుల సమీకరణకు వీలుండగా.. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు రూ.1.06 లక్షల కోట్ల అదనపు రుణాలకు అనుమతులు దక్కించుకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన