రాష్ట్రాలకు పారదర్శకంగా టీకాల పంపిణీ
close

ప్రధానాంశాలు

Updated : 25/06/2021 05:46 IST

రాష్ట్రాలకు పారదర్శకంగా టీకాల పంపిణీ

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

దిల్లీ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొవిడ్‌-19 టీకాలను పూర్తి పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో జనాభా, కేసుల తీవ్రత, వినియోగ సమర్థత, వృథాకు దారితీస్తున్న పరిస్థితులు.. వంటి అంశాల ఆధారంగానే డోసులను కేటాయిస్తున్నట్లు వివరించింది. టీకాల పంపిణీలో పారదర్శకత లోపించిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా.. పూర్తి శాస్త్రీయ విధానంలోనే భారత జాతీయ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన టీకాలు.. రాష్ట్రాల్లో వాటి వినియోగం, వాటివద్ద అందుబాటులో ఉన్నవి, వినియోగించని డోసులు, అందజేయనున్న టీకాలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నట్లు గుర్తుచేసింది.

రాష్ట్రాల వద్ద 1.89 కోట్ల డోసులు..

రాష్ట్రాల వద్ద ఇంకా 1.89 కోట్లకు పైగా కొవిడ్‌ టీకా డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3 రోజుల్లో రాష్ట్రాలకు మరో 21,05,010 డోసులు కూడా పంపించనున్నట్లు తెలిపింది. ఇంతవరకు మొత్తం 30 కోట్లకు పైగా (30,33,27,440) డోసులను రాష్ట్రాలకు అందజేసినట్లు పేర్కొంది. వృథా అయినవాటితో కలిసి గురువారం ఉదయం 8 గంటల వరకు 28,43,40,936 డోసులు వినియోగించినట్లు తెలిపింది.


స్వల్పంగా పెరిగిన కొవిడ్‌ కేసులు
 ఒక్కరోజులో 54,069 నమోదు
మరో 1,321 మంది మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య గురువారం స్పల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో 54,069 కొత్త కేసులు బయటపడగా.. 1,321 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 3,221 మేర పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 3,00,82,778కి చేరగా.. ఇంతవరకు కొవిడ్‌ బారిన పడి 3,91,981 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 68,885 మంది కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 6,27,057 (2.08%)కి తగ్గింది. ఇంతవరకు 2,90,63,740 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 96.61%కి వృద్ధి చెందింది.

* దేశంలో బుధవారం 18,59,469 కొవిడ్‌ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.91%, వారపు పాజిటివిటీ రేటు 3.04%గా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 64.89 లక్షల టీకా డోసులు వేశారు. దీంతో గురువారం నాటికి వేసిన మొత్తం డోసుల సంఖ్య 30.72 కోట్లు దాటింది. నెల రోజుల క్రితంతో పోలిస్తే రోజువారీ కేసులు 72.47% తగ్గాయి.

మహారాష్ట్రలో కేసుల తీవ్రత..

మహారాష్ట్రలో వారం రోజుల తర్వాత మళ్లీ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంతవరకు ఒక్క మహారాష్ట్రలోనే 59.97 లక్షల కేసులు, 1.19 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే గణాంకాల్లో ఈ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలుస్తుంది. ఫ్రాన్స్‌ కంటే అధికంగా కేసులు (57.62 లక్షలు), మరణాలు (1.10 లక్షలు) మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇదే తరహాలో లెక్కిస్తే ప్రపంచంలో కేరళ 16, కర్ణాటక 17, తమిళనాడు 18, ఆంధ్రప్రదేశ్‌ 22 స్థానాల్లో నిలుస్తాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన