జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా చూపిన ట్విటర్‌

ప్రధానాంశాలు

Updated : 29/06/2021 11:35 IST

జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా చూపిన ట్విటర్‌

విరుచుకుపడిన నెటిజన్లు

దిల్లీ: నూతన ఐ.టి. నిబంధనల విషయంలో ట్విటర్‌తో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొలిక్కి రాకముందే మరో వివాదం రేగింది. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు పటాన్ని ట్విటర్‌ తన వెబ్‌సైట్లో ప్రదర్శించింది. దీనిపై నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘ట్విటర్‌ బ్యాన్‌’ అంటూ 17వేల ట్వీట్లు వచ్చాయి. ట్విటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. దీంతో సామాజిక మాధ్యమ సంస్థ స్పందించి వెబ్‌సైట్‌ నుంచి ఆ పటాన్ని కొన్ని గంటల్లోనే తొలగించింది. దేశ భౌగోళిక సరిహద్దులను ట్విటర్‌ ఇలా తప్పుగా చూపడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ఏమాత్రం అగౌరవపరిచినా సహించేది లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నవంబరులో లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా జమ్మూ-కశ్మీర్‌లో భాగంగా చూపడంపైనా ట్విటర్‌కు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన