కొవాగ్జిన్‌తో డెల్టా వేరియంట్‌కు కళ్లెం

ప్రధానాంశాలు

Updated : 01/07/2021 08:07 IST

కొవాగ్జిన్‌తో డెల్టా వేరియంట్‌కు కళ్లెం

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్‌- ‘డెల్టా’కు కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా ముకుతాడు వేయగలదని అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్‌)’ వెల్లడించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సహకారంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ ఆల్ఫా వేరియంట్‌నూ ప్రభావవంతంగా నిలువరించలదని తెలిపింది. కొవాగ్జిన్‌ గ్రహీతల రక్త నమూనాలపై నిర్వహించిన రెండు అధ్యయనాలు ఈ విషయాలను ధ్రువీకరించాయని పేర్కొంది. ఆల్ఫా వేరియంట్‌ (బి.1.1.7) బ్రిటన్‌లో, డెల్టా వేరియంట్‌ (బి.1.617) భారత్‌లో తొలిసారిగా బయటపడ్డాయి. ఈ రెండు రకాలనూ సమర్థంగా నిర్వీర్యం చేసే యాంటీబాడీలను కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు ఎన్‌ఐహెచ్‌ స్పష్టం చేసింది. ఈ టీకా వినియోగం సురక్షితమని రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు తేల్చిచెప్పిన సంగతిని గుర్తుచేసింది. మూడో దశ ట్రయల్స్‌ ఫలితాలు ఈ ఏడాది వెల్లడవనున్నాయని పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన