Covishield: కొవిషీల్డ్‌తో 9 ఐరోపా దేశాలకు వెళ్లొచ్చు

ప్రధానాంశాలు

Updated : 02/07/2021 07:47 IST

Covishield: కొవిషీల్డ్‌తో 9 ఐరోపా దేశాలకు వెళ్లొచ్చు

దిల్లీ: కొవిషీల్డ్‌ టీకా వేసుకున్న భారతీయులు.. ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా తొమ్మిది ఐరోపా దేశాలకు ప్రయాణించొచ్చు. ఈ మేరకు ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, ఎస్తొనియా దేశాలు అంగీకరించాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను ‘గ్రీన్‌పాస్‌’ పథకం పరిధిలోకి తేవాలంటూ ఐరోపా యూనియన్‌లోని సభ్య దేశాలకు భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఐరోపా మెడిసన్స్‌ ఏజెన్సీ (ఈఎంఏ) ధ్రువీకరించిన టీకాలు వేసుకున్న వారు మాత్రమే ‘గ్రీన్‌పాస్‌’ పథకం ద్వారా ఐరోపా యూనియన్‌ దేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణాలు చేయొచ్చు. ఇందులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ను చేర్చలేదు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదించిన టీకాలను వేసుకున్నవారికీ అనుమతులు మంజూరు చేయొచ్చని, దీనిపై నిర్ణయం సభ్య దేశాలు వ్యక్తిగతంగా తీసుకోవాలని ఐరోపా యూనియన్‌ పేర్కొంది. కొవిషీల్డ్‌ వేసుకున్న భారతీయులపై ఇప్పటివరకు తొమ్మిది దేశాలు ప్రయాణ ఆంక్షలు తొలగించాయని విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన