కరోనా బాధితులకు ఊబకాయం శాపం కాదు

ప్రధానాంశాలు

Published : 04/07/2021 04:40 IST

కరోనా బాధితులకు ఊబకాయం శాపం కాదు

వాషింగ్టన్‌: పురుషులు, శరీర బరువు ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 బాధితులకు మరణం ముప్పు ఎక్కువంటూ జరిగిన విశ్లేషణలను తాజా అధ్యయనం ఖండించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 44,305 మందితో సాగిన 58 అధ్యయనాలను విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. ఐసీయూలో చేరిన కొవిడ్‌ బాధితుల్లో పొగతాగేవారికి 40 శాతం, అధిక రక్తపోటు ఉన్నవారికి 54 శాతం, మధుమేహం ఉన్నవారికి 41 శాతం, శ్వాస సంబంధ రుగ్మతలున్నవారికి 75 శాతం మేర మరణం ముప్పు ఎక్కువని వెల్లడైంది. ఈ ముప్పు.. హృద్రోగం లేదా క్యాన్సర్‌ బాధితుల్లో రెట్టింపు స్థాయిలోను, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు 2.4 రెట్లు ఎక్కువగాను ఉంటుందని వెల్లడైంది. ‘‘ఈ వ్యాధులకు కొవిడ్‌ మరణాలతో ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధన ధ్రువీకరిస్తోంది. అయితే మగవారికి, అధిక బరువును కలిగి ఉన్నవారికి మరణం ముప్పు పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన బ్రూస్‌ ఎం బికార్డ్‌ చెప్పారు. పొగ తాగడం, శ్వాస సంబంధ సమస్యల వల్ల ఏసీఈ-2 రెసెప్టార్ల వ్యక్తీకరణ పెరుగుతుందని చెప్పారు. మానవ కణంలోకి ప్రవేశించడానికి ఈ రెసెప్టార్‌ను కరోనా వైరస్‌ ఉపయోగించుకుంటుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన