Corona: కణ ‘శక్తి’పై కరోనా దెబ్బ

ప్రధానాంశాలు

Updated : 07/07/2021 06:43 IST

Corona: కణ ‘శక్తి’పై కరోనా దెబ్బ

వాషింగ్టన్‌: తీవ్రస్థాయి కొవిడ్‌-19 బాధితుల్లో కొందరికి అవయవాలు విఫలం కావడానికి కారణాలను అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను కరోనా వైరస్‌ నిలువరిస్తోందని, అవయవాల వైఫల్యానికి ఇదే కారణమవుతోందని తేల్చారు. మన ఒంట్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. అప్పుడే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఇక్కడే దెబ్బకొడుతోంది. గుండె, కిడ్నీలు వంటి అవయవాల్లోని కణాలు శక్తిని తయారుచేసుకునే ప్రక్రియను ఇది నిలువరిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో అవయవాలు చతికిలపడిపోతున్నాయని చెప్పారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. శాస్త్రవేత్తలు తొలుత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేలా ఎలుకల్లో మార్పులు చేశారు. ఈ జీవుల్లోని ఏసీఈ-2 గ్రాహకాన్ని కరోనా గుర్తించలేదు. అందువల్ల వైరస్‌ ప్రభావానికి గురిచేసినా వాటికి ఇన్‌ఫెక్షన్‌ రాదు. అందుకే కరోనా సోకేలా ఈ ఎలుకల్లో జన్యుమార్పులు చేసి, పరిశోధన సాగించారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఎలుకలన్నీ ఏడు రోజుల్లోనే తిండి మానేశాయి. సగటున 20% మేర బరువు తగ్గాయి. ఇవన్నీ కణాల్లో శక్తి ప్రక్రియ నిలిచిపోయిందనటానికి సూచికలే. కరోనా బాధితుల్లో అవయవాల వైఫల్యాన్ని నివారించే కొత్త చికిత్సలకు ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన