బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేయవద్దు

ప్రధానాంశాలు

Updated : 09/07/2021 05:54 IST

బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేయవద్దు

ఇది ప్రమాదకరమవుతుంది

122 మంది నిపుణుల లేఖ

లండన్‌: ఈ నెల 19 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించాలన్న బ్రిటన్‌ ప్రభుత్వ యోచనను 122 మంది శాస్త్రవేత్తలు, వైద్యులు తప్పుపట్టారు. ఇది ‘ప్రమాదకరమైన, అనైతిక ప్రయోగమ’ని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఒక బహిరంగ లేఖను రాశారు. వీరిలో భారత సంతతికి చాంద్‌ నాగ్‌పాల్‌, దీప్తి గురుదాసాని, భరత్‌ పంఖానియా, సునీల్‌ రైనా వంటివారు కూడా ఉన్నారు. దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతుందని వారు చెప్పారు. ఫలితంగా లక్షల మంది దీర్ఘకాల రుగ్మతల బారినపడతారని హెచ్చరించారు. అందువల్ల ప్రజలు, చిన్నారులను రక్షించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం తన వ్యూహాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ లేఖ ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమైంది. 19 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించే అంశంపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటానని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల ప్రకటించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన