అమెరికా రాయబారికి హిందీ తెలుసు!

ప్రధానాంశాలు

Published : 11/07/2021 05:34 IST

అమెరికా రాయబారికి హిందీ తెలుసు!

భారత్‌కు రావడం గౌరవప్రదమన్న గార్సెటీ

వాషింగ్టన్‌: భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులు కావడం తనకు లభించిన గౌరవమని ఎరిక్‌ ఎం.గార్సెటీ (50) అన్నారు. ప్రస్తుతం ఆయన లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌గా పనిచేస్తున్నారు. ట్రంప్‌ హయాంలో నియమితులైన కెన్నెత్‌ జస్టర్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పలుమార్లు భారత్‌లో పర్యటించారు. కళాశాలలో చదివే రోజుల్లో ఏడాది పాటు హిందీ, ఉర్దూలను అభ్యసించారు. ‘‘భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. త్వరలోనే అత్యంత జనాభాగల దేశంగా అవతరించనుంది. సూపర్‌ పవర్‌లలో ఒకటిగా ఎదగనుంది. భారత్‌ సహకారం లేకుండా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించలేం. వారితో మనకు దగ్గర సంబంధం ఉంది’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన 12 ఏళ్ల పాటు అమెరికా నేవీలో నిఘా విభాగం అధికారిగా పనిచేశారు. పసిఫిక్‌ ఫ్లీట్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. 2017లో లెఫ్టినెంట్‌గా పదవీ విరమణ చేశారు. ఆక్స్‌ఫోర్డ్‌లోని క్వీన్‌ కాలేజీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో విద్యాభ్యాసం చేశారు. ఈ నియామకాన్ని పలువురు ఇండియన్‌-అమెరికన్‌ ప్రముఖులు స్వాగతించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన