గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ

ప్రధానాంశాలు

Updated : 16/07/2021 07:35 IST

గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న మోదీ

 మరిన్ని ప్రాజెక్టులు నేడు అందుబాటులోకి...

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వేస్టేషన్‌తో పాటు మరో ఎనిమిది ప్రాజెక్టులను వీడియో ద్వారా ప్రారంభించనున్నారు. రూ.71.50 కోట్లతో అధికారులు దీన్ని ఆధునిక వసతులు, హంగులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. విశాలమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటుచేశారు. 160 కార్లు, 40 ఆటోలు, 120 ద్విచక్ర వాహనాలను పార్కు చేసేందుకు వసతి కల్పించారు. రైల్వే ప్లాట్‌ఫాం వద్ద 480 మంది నిరీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌, ఎక్కడికక్కడ లిఫ్టులు, ఎస్కలేటర్లు పెట్టారు. వై-ఫైతోపాటు... భిన్న మతాలవారు ప్రార్థనలు చేసుకునేలా హాలు కూడా ఉంది. 120 ఏళ్ల మన్నిక ఉండేలా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల కోసం స్టేషన్‌ ప్రాంగణంలో 7,096 చదరపు మీటర్ల సువిశాల స్థలాన్ని విడిచిపెట్టారు. ఆర్ట్‌ గ్యాలరీలో ఎల్‌ఈడీ కాంతులు అబ్బురపరుస్తున్నాయి. అసోచాం ఇప్పటికే దీన్ని హరిత భవనం ‘జెమ్‌-5’గా గుర్తించింది. ఈ స్టేషన్‌ నుంచి ప్రతివారం వారణాసికి వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. స్టేషన్‌ పైభాగంలో రూ.790 కోట్లతో నిర్మించిన ఫైవ్‌స్టార్‌ హోటల్‌నూ మోదీ లాంఛనంగా ఆరంభిస్తారు. ఇందులో 318 గదులున్నాయి. తన సొంత పట్టణం వాడ్‌నగర్‌ను కలిపే గాంధీనగర్‌-వరెథా ఎంఈఎంయూ రైలును కూడా ప్రధాని ప్రారంభిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన