ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తాం

ప్రధానాంశాలు

Updated : 16/07/2021 07:36 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తాం

 రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌

పీలీభీత్‌: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేక వాతావరణం సృష్టించేలా అన్నివిధాలుగా పని చేస్తామని రైతు నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ అన్నారు. పశ్చిమబెంగాల్‌ మాదిరిగానే ఇక్కడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా కృషి చేస్తామన్నారు. కొత్త సాగుచట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న రైతులకు నాయకత్వం వహిస్తున్న టికాయిత్‌ గురువారం పీలీభీత్‌లో విలేకరులతో మాట్లాడారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీకేయూ పోటీ చేయదు. ఏ రాజకీయ పార్టీకి మద్దతు కూడా ఇవ్వదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న రైతులు భాజపాకు, ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం సృష్టించేలా పనిచేస్తారు’’ అని అన్నారు. రైతులంతా భాజపా అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తారన్నారు. పశ్చిమబెంగాల్‌లోనూ భాజపాకు వ్యతిరేక వాతావరణం ఏర్పడేలా చేయడంలో బీకేయూ విజయవంతమైందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన