విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్‌ ప్రధాని దేవ్‌బా

ప్రధానాంశాలు

Published : 19/07/2021 05:06 IST

విశ్వాస పరీక్షలో నెగ్గిన నేపాల్‌ ప్రధాని దేవ్‌బా

కాఠ్‌మాండూ: నేపాల్‌ నూతన ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆదివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. 275 మంది సభ్యులున్న పార్లమెంటులో 249 మంది ఓటింగులో పాల్గొనగా ఆయనకు అనుకూలంగా 165 మంది ఓటు వేశారు. నేపాల్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన ఈ నెల 13న ప్రధానిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పునరుద్ధరించిన దిగువ సభ సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగా అనూహ్యంగా తొలిరోజే విశ్వాస పరీక్ష పూర్తయింది. మరో ఒకటిన్నరేళ్లు ఆయన ప్రధానిగా కొనసాగుతారని, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని నేపాల్‌ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి.

అభినందించిన మోదీ

దిల్లీ: నేపాల్‌ ప్రధాని దేవ్‌బాను భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో ఉన్న విశిష్ట భాగస్వామ్యం మరింత పరిఢవిల్లుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన