జలాంతర్గాముల నిర్మాణానికి టెండర్‌

ప్రధానాంశాలు

Published : 21/07/2021 04:41 IST

జలాంతర్గాముల నిర్మాణానికి టెండర్‌

జారీచేసిన రక్షణ మంత్రిత్వశాఖ

దిల్లీ: అధునాతన పరిజ్ఞానంతో దేశీయంగా ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (టెండర్‌) జారీచేసింది. రూ.40,000 కోట్లకుపైగా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ‘రక్షణ కొనుగోళ్ల మండలి’ (డీఏసీ) గత నెల్లో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ‘వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా’ కింద చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉత్పత్తిదారులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని భారత్‌లోనే అధునాతన ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేస్తాయి. మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌), ఎల్‌ అండ్‌ టీలకు ఆర్‌ఎఫ్‌పీని జారీచేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎల్‌అండ్‌టీ, ఎండీఎల్‌లు ఇప్పటికే ఎంపికచేసిన విదేశీ సంస్థలైన.. దేవూ షిప్‌బిల్డింగ్‌ (దక్షిణకొరియా), థిస్సెంక్రప్‌ మెరైన్‌ సిస్టమ్స్‌ (జర్మనీ), నవాంటియా (స్పెయిన్‌), నేవల్‌ గ్రూప్‌ (ఫ్రాన్స్‌), జేఎస్‌సీ ఆర్‌వోఈ (రష్యా)లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటాయి. ‘‘ఈ ఐదు విదేశీ సంస్థలు సాంప్రదాయ జలాంతర్గాముల రూపకల్పన, నిర్మాణం, సంబంధిత ఇతర సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రపంచంలోనే మేలైనవి’’ అని రక్షణ శాఖ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన