అశ్లీల చిత్రాల దందాతో రూ.లక్షల ఆర్జన

ప్రధానాంశాలు

Published : 21/07/2021 04:41 IST

అశ్లీల చిత్రాల దందాతో రూ.లక్షల ఆర్జన

23 వరకూ కస్టడీకి రాజ్‌ కుంద్రా

ముంబయి: అశ్లీల చిత్రాల కేసులో సోమవారం అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా వ్యవహారంలో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్‌ బక్షితో కలసి కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్‌ గ్రూప్‌ చాటింగ్‌, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైందని ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్‌ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్‌ అనే నిర్మాణ సంస్థ ఉంది. దాని ఆధ్వర్యంలో హాట్‌షాట్స్‌ అనే యాప్‌ను నిర్వహిస్తున్నారు. కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా బలవంతం చేసి, వాటిని చిత్రీకరిస్తున్నారని, తర్వాత వాటిని కెన్రిన్‌ సంస్థకు ఓ అప్లికేషన్‌ ద్వారా పంపిస్తున్నారని పోలీసులు చెప్పారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్‌ నుంచి హాట్‌షాట్స్‌ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. వాటిని వీక్షించడానికి సబ్‌స్క్రైబర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేవారని వివరించారు. ఈ దందాతో కుంద్రా లక్షల రూపాయలు ఆర్జించినట్లు తెలుస్తోందన్నారు. పలువురు ఏజెంట్ల ద్వారా అశ్లీల చిత్రాల నిర్మాణానికి కెన్రిన్‌ నిధులు అందజేసినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ఈ చిత్రాల్లో నటించినవారికి చెల్లించాల్సిన పారితోషికాలకు సంబంధించి రాజ్‌ కుంద్రా అడ్మిన్‌గా ‘హెచ్‌ అకౌంట్స్‌’ పేరుతో ఓ వాట్సప్‌ గ్రూపును ఏర్పాటు చేశారని చెప్పారు. గెహనా వసిస్ఠ్‌ అనే నటితోపాటు కుంద్రా అసిస్టెంట్‌ ఉమేశ్‌ కామత్‌ ఇందులో కీలకంగా వ్యవరించేవారన్నారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ఈయనకు జులై 23 వరకూ కోర్టు పోలీస్‌ కస్టడీ విధించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన