చిన్నారులపై లైంగిక హింస, వీడియోల విక్రయం..

ప్రధానాంశాలు

Updated : 21/07/2021 04:51 IST

చిన్నారులపై లైంగిక హింస, వీడియోల విక్రయం..

గోవాలో పాకశాస్త్ర నిపుణుడి అరెస్ట్‌

దిల్లీ: చిన్నారులపై లైంగిక హింసకు పాల్పడడమే కాకుండా, ఆ వికృత చేష్టలతో కూడిన వీడియోలను సామాజిక అనుసంధాన వేదికలు, డార్క్‌వెబ్‌ ద్వారా భారతీయులకు, విదేశీయులకు విక్రయించిన ఆరోపణలపై గోవాకు చెందిన ఓ వ్యక్తిని సీబీఐ అరెస్టుచేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. నిందితుడు సుమారు 25 నుంచి 30 ఘోరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ మేరకు గోవాలోని ఓ హోటల్‌లో పాకశాస్త్ర నిపుణుడిగా(షెఫ్‌గా) పనిచేస్తున్న 29 ఏళ్ల వ్యక్తిపై సీబీఐ గత నెల 22న కేసు నమోదుచేసింది. కేసు సున్నితత్వం దృష్ట్యా నిందితుడి వ్యక్తిగత వివరాలను సీబీఐ బహిర్గతం చేయలేదు. చిత్రకూట్‌ కేంద్రంగా చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన ఉత్తర్‌ప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ కేసు దర్యాప్తు చేస్తుండగా గోవా ఘోరాల ఆచూకీ లభించినట్లు అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన