భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 04:45 IST

భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

దిల్లీ: బర్డ్‌ ఫ్లూతో భారత్‌లో తొలి మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో సంబంధిత వైద్యులు, సిబ్బంది స్వీయ ఏకాంతానికి వెళ్లారు. బర్డ్‌ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం దేశంలో ఇదే తొలిసారి. హరియాణాకు చెందిన సుశీల్‌ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా సమస్యలతో ఈ నెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్‌ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులను గుర్తించడానికి, ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ (ఎన్‌సీడీసీ) ఓ బృందాన్ని హరియాణాలోని బాలుడి స్వగ్రామానికి పంపింది. బర్డ్‌ ఫ్లూ సాధారణంగా పక్షులు, కోళ్లలో వస్తుంది.

మనిషి నుంచి మనిషికి అరుదుగానే: గులేరియా

బర్డ్‌ ఫ్లూ ఒక మనిషి నుంచి మరొకరికి సోకడం అరుదని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా చెప్పారు. ‘‘పక్షుల నుంచి మనిషికి ఈ వైరస్‌ సోకడం అరుదు. మనిషి నుంచి మనిషికి ఇది వ్యాపిస్తుందని ఇప్పటివరకూ నిర్ధారణ కాలేదు. ఆందోళన అక్కర్లేదు. పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు తప్పకుండా జాగ్రత్తలను మాత్రం పాటించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘సూక్ష్మ పరిమాణంలోని గాలి తుంపర్ల కారణంగా మనుషుల మధ్య బర్డ్‌ ఫ్లూ వ్యాపించే అవకాశం లేదు. సీరోలాజికల్‌ సర్వేలో లక్షణాల్లేని బర్డ్‌ ఫ్లూ కేసులు గానీ, వైద్య సిబ్బందికి సోకినట్టు గానీ నిర్ధారణ కాలేదు. పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించి తింటే అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అనారోగ్యంతో ఉన్న, చనిపోతున్న కోళ్లను మాత్రం తినకూడదు’’ అని ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌ డా.నీరజ్‌ నిశ్చల్‌ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన