జెఫ్‌ బెజోస్‌ సాహస అవార్డులు
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 05:54 IST

జెఫ్‌ బెజోస్‌ సాహస అవార్డులు

 ప్రముఖ సామాజిక సేవకులు ఇద్దరు ఎంపిక

పురస్కారం కింద ఒక్కొక్కరికి 100 మిలియన్‌ డాలర్లు

రోదసి యాత్ర అనంతరం కీలక ప్రకటన

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మరో సంచలన ప్రకటన చేశారు. తమ సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో తొలిసారి అంతరిక్షంలోకి దిగ్విజయంగా వెళ్లొచ్చిన సందర్భంగా మంగళవారం ‘కరేజ్‌ అండ్‌ సివిలిటీ’ అనే అవార్డుని నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ప్రారంభ పురస్కారానికి ప్రముఖ చెఫ్‌.. జోస్‌ ఆండ్రెస్‌, సామాచ్కీజిజిక కార్యకర్త వ్యాన్‌ జోన్స్‌లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో 100 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.746 కోట్లు) ప్రదానం చేయనున్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు బెజోస్‌ తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు.

భోజనాల దాత జోస్‌ ఆండ్రెస్‌..

జోస్‌ ఆండ్రెస్‌ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చెఫ్‌. 2010లో వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌(డబ్ల్యూసీకే) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలు, కరవు ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందజేస్తున్నారు. మన దేశంలో సంజీవ్‌ కపూర్‌ అనే ప్రముఖ చెఫ్‌తో కలిసి 15 నగరాల్లోని 30 ప్రాంతాల నుంచి ప్రజలకు భోజనాన్ని సమకూర్చుతున్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆసుపత్రుల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్యారోగ్య సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. రెండు వారాల క్రితం భారత్‌కు వచ్చిన ఆండ్రెస్‌ మన దేశంలో 4 లక్షల భోజనాలు అందజేసినట్లు వెల్లడించారు.

అట్టడుగు వర్గాల ఆశాకిరణం వ్యాన్‌ జోన్స్‌...

  అమెరికాకు చెందిన వ్యాన్‌ జోన్స్‌...ప్రముఖ టీవీ హోస్ట్‌. రచయిత. న్యూయార్క్‌ టైమ్స్‌ ‘బెస్ట్‌ సెల్లింగ్‌’ రచయితగా మూడుసార్లు ఎంపికయ్యారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. అందుకోసం వినూత్న పరిష్కారాలు సూచించే ‘డ్రీమ్‌ కోర్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. క్రిమినల్‌ జస్టిస్‌లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు, సామాజిక రుగ్మతలను రూపుమాపడం కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన