నైజీరియాలో 100 మందిని విడిచిపెట్టిన బందిపోట్లు!
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:58 IST

నైజీరియాలో 100 మందిని విడిచిపెట్టిన బందిపోట్లు!

 6 వారాల తర్వాత బాధితులకు విముక్తి

లాగోస్‌: నైజీరియాలో గత నెలలో దుండగులు అపహరించిన 100 మందిని బుధవారం విడిచిపెట్టారు. జూన్‌ 8న మనావా గ్రామం నుంచి వీరందరినీ సాయుధులైన బందిపోట్లు అపహరించినట్లు జామ్‌ఫరా రాష్ట్ర పోలీసులు తెలిపారు. 6 వారాల పాటు వారంతా దుండగుల చెరలో ఉన్నారు. నైజీరియా వాయువ్య, ఉత్తర-మధ్య ప్రాంతాల్లోని జామ్‌ఫరా, ఇతర రాష్ట్రాల్లో సాయుధులతో కూడిన ముఠాలు సామూహిక అపహరణలకు పాల్పడుతుంటాయి. అనంతరం వారిని విడుదల చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. తాజాగా దుండగుల చేతుల్లోంచి బాధితులను బేషరతుగా, డబ్బులేమీ చెల్లించకుండానే విడిపించడంలో ప్రభుత్వం విజయం సాధించినట్లు పోలీసులు తెలిపారు. అపహరణకు గురైనవారిలో ఎక్కువ మంది బాలింతలు, పిల్లలే ఉన్నారు. ఇటీవల ఉత్తర  నైజీరియాలోనూ అధిక సంఖ్యలో బడి పిల్లలను వారి స్కూళ్ల నుంచి దుండగులు అపహరించారు. గత ఫిబ్రవరి నుంచి దాదాపు 800 మంది పిల్లలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. నైజర్‌ రాష్ట్రంలోని కాగరా ప్రాంతంలోని ఓ కళాశాల నుంచి 27 మంది విద్యార్థులు, టీచర్లను కూడా అపహరించుకుపోయారు. ఈనెల 5న కూడా కడునాలోని ఓ హైస్కూలు నుంచి 120 మంది విద్యార్థులను సామూహికంగా అపహరించారు. వారంతా ఇప్పటికీ దుండగుల చెరలోనే ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన