పాక్‌ మాజీ రాయబారి కుమార్తె దారుణ హత్య
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:59 IST

పాక్‌ మాజీ రాయబారి కుమార్తె దారుణ హత్య

 ఇస్లామాబాద్‌లో ఘటన

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు చెందిన మాజీ దౌత్యవేత్త షౌకత్‌ ముకాదమ్‌ కుమార్తె నూర్‌ ముకాదమ్‌ (27) ఇస్లామాబాద్‌లో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహాన్ని ఇక్కడి సెక్టార్‌ ఎఫ్‌-7/4 ప్రాంతంలో కనుగొన్నారు. ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారని ‘డాన్‌’ పత్రిక బుధవారం పేర్కొంది. ఈ హత్యకు సంబంధించి నూర్‌ స్నేహితడు జహీర్‌ జాఫర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల ఇస్లామాబాద్‌లోని అఫ్గానిస్థాన్‌ రాయబారి కుమార్తె అపహరణ నేపథ్యంలో పాక్‌-అఫ్గాన్‌ల మద్య దౌత్యపరమైన వివాదం చేలరేగిన కొద్ది రోజుల్లో ఈ హత్య ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. షౌకత్‌ ముకాదమ్‌ గతంలో దక్షిణ కొరియా, కజఖిస్థాన్‌లలో పాక్‌ రాయబారిగా పనిచేశారు. ఈ హత్య ఘటనతో పాక్‌లో దౌత్య యంత్రాంగాలు, వాటి సిబ్బంది భద్రతపై కూడా పెద్దఎత్తున దుమారం రేగుతోంది. ఈనెల 16న పాక్‌లో ఆఫ్గానిస్థాన్‌ రాయబారి నచ్కీజీజిబుల్లా అలీఖిల్‌ కుమార్తె సిల్సిలా అలీఖిల్‌ (26) అపహరణకు గురయ్యారని, ఆమెను చిత్రహింసలకు గురిచేశారని అఫ్గాన్‌ విదేశాంగ కార్యాలయం ఇటీవల తెలిపింది. అయితే అఫ్గాన్‌ చేస్తున్న ఆరోపణలు తప్పంటూ పాక్‌ అనంతరం ఖండించింది. అపహరణకు గురైనట్లు ఆధారాలేమీ ఇస్లామాబాద్‌ పోలీసులకు దొరకలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదం దౌత్యపరమైన వివాదం చెలరేగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన