సరిహద్దు దాటుతున్న..ఐదుగురు బంగ్లాదేశీయుల పట్టివేత

ప్రధానాంశాలు

Published : 23/07/2021 06:20 IST

సరిహద్దు దాటుతున్న..ఐదుగురు బంగ్లాదేశీయుల పట్టివేత

కోల్‌కతా: దక్షిణ బెంగాల్‌లో రెండు చోట్ల అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దు దాటుతున్న ఐదుగురు బంగ్లాదేశ్‌ పౌరుల్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) అదుపులోకి తీసుకుంది. ఇందులో ముగ్గురు భారత్‌లోకి చొరబడుతూ, మరో ఇద్దరు బంగ్లాదేశ్‌లోకి వెళ్తూ పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లో కొంతకాలం పనిచేసి.. బంగ్లాదేశ్‌లోని సోనాపూర్‌, జెస్సోర్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు తిరిగి స్వదేశం వెళ్లే ప్రయత్నంలో గురువారం తెల్లవారుజామున నాడియా జిల్లాలో సరిహద్దు దాటుతూ దొరికిపోయారు. అలాగే బంగ్లాదేశ్‌లోని కుండ్లా జిల్లాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు ఉత్తర 24 పరగణాల ప్రాంతంలో భారత్‌లోకి ప్రవేశిస్తూ బుధవారం సాయంత్రం పట్టుబడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భారత్‌లో పని వెతుక్కుంటూ వస్తున్నామని, ఇందుకోసం దళారులకు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించామంటూ వారంతా చెప్పారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. వీరిని స్థానిక పోలీసు స్టేషన్లలో అప్పగించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన