కొంకణ్‌ డివిజన్‌ కకావికలం

ప్రధానాంశాలు

Published : 25/07/2021 05:23 IST

కొంకణ్‌ డివిజన్‌ కకావికలం

136కు చేరిన మృతుల సంఖ్య
ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

ముంబయి: అతి భారీ వర్షాలతో మహారాష్ట్రలోని కొంకణ్‌, పశ్చిమ ప్రాంతాలు కకావికలమయ్యాయి. రత్నగిరి జిల్లాను వరదలు ముంచెత్తగా; రాయ్‌గడ్‌, సతారా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. వివిధ వర్గాల అనధికారిక సమాచారం ప్రకారం మరణించిన వారి సంఖ్య 136కు పెరిగింది. కొండచరియలు కూలిన సంఘటనలు అధికంగా ఉన్న రాయ్‌గడ్‌, సతారా జిల్లాల్లో మరణాలు అధికంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం కనీసం 112 మంది చనిపోయారని, 99 మంది ఆచూకీ తెలియరావడం లేదని పేర్కొంది. శనివారం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. 21 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 14 ఆర్మీ, కోస్టుగార్డు దళాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ప్రభుత్వ ఉద్యోగులు సేవల్లో పాల్గొంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఒక్క పుణె జిల్లాలోనే 23 చోట్ల కొండచరియలు కూలినట్టు చెప్పారు. సతారా జిల్లా అంబేఘర్‌ వద్ద కొండచరియ కూలిన దుర్ఘటనలో మరో అయిదు మృత దేహాలను గుర్తించారు. ఇక్కడ కనీసం 16 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. రాయ్‌గడ్‌ జిల్లా మహర్‌ తాలుకా తలాయి గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 44కి పెరిగింది. సాంగ్లీ జిల్లాలో కృష్ణ, కొల్హాపుర్‌ జిల్లాలో పంచగంగ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నష్టంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. గవర్నరు భగత్‌ సింగ్‌ కోశ్యారీకి ఫోన్‌ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. ఆదివారం కూడా కొంకణ్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

జేఈఈ-మెయిన్‌ అభ్యర్థులకు మరో అవకాశం

వరదల కారణంగా జేఈఈ-మెయిన్‌ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన