కేంద్ర ఉద్దీపన పథకం ఏమాత్రం సరిపోలేదు

ప్రధానాంశాలు

Published : 28/07/2021 05:24 IST

కేంద్ర ఉద్దీపన పథకం ఏమాత్రం సరిపోలేదు

ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన ప్యాకేజీపై కేకే నేతృత్వంలోని స్థాయీసంఘం అసంతృప్తి

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి కారణంగా కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకం ఏ మాత్రం సరిపోలేదని తెరాస ఎంపీ కె.కేశవరావు నేతృత్వంలోని పరిశ్రమలశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణం ఈ రంగానికి నగదు చెలామణి పెంచడానికి బదులు దీర్ఘకాల రుణాలను ప్రకటించడం ప్రయోజనకరంగా లేదని మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కరోనా తొలి ఉద్ధృతి కంటే రెండో ఉద్ధృతిలో ఎంఎస్‌ఎంఈ రంగం ఆర్థికవ్యవస్థ వేగంగా దెబ్బతిన్నట్లు తెలిపింది. అందువల్ల ఈ రంగంలో డిమాండ్‌, పెట్టుబడి, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనను పెంచి ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చే తక్షణ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. ఆ శాఖ అధికారులు స్థాయీసంఘానికి సమర్పించిన సమాధానాలను చూస్తే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అనంతరం ఈ రంగం వాస్తవంగా ఎంత నష్టపోయిందన్న అంశంపై ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ సరైన అధ్యయనం చేయలేదని తేలినట్లు పేర్కొంది. అందువల్ల ఎంఎస్‌ఎంఈ రంగానికి జరిగిన వాస్తవ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం కచ్చితమైన మదింపు చేయాలని సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన