పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలి

ప్రధానాంశాలు

Published : 28/07/2021 05:24 IST

పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలి

సుప్రీంను కోరిన ఎన్‌.రామ్‌, శశికుమార్‌

దిల్లీ: ‘పెగాసస్‌’ విషయమై ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌లు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌ను ఉపయోగించి పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవాదులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు గూఢచర్యానికి పాల్పడ్డాయన్న అంశంపై... సిట్టింగ్‌ లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. ఫోన్లపై నిఘా పెట్టడం- వ్యక్తుల ప్రైవేటు జీవితాలపై దాడి చేయడమే కాక... వారి భావ, భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ‘‘భారత్‌కు చెందిన పాత్రికేయులు, న్యాయవాదులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, హక్కుల కార్యకర్తలు మొత్తం 142 మందిపై ప్రభుత్వ సంస్థలు నిఘా పెట్టాయని ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. స్పైవేర్‌ను ఉపయోగించి వ్యక్తులపై గూఢచర్యానికి పాల్పడటం ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు. ఫోన్ల హ్యాకింగ్‌కు పాల్పడటం సమాచార సాంకేతిక చట్ట నిబంధనలకూ విరుద్ధమే’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు.

* ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపునకు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ భారతీయ క్లయింట్‌ ఎవరో తెలిసేవరకూ... గూఢచర్యం ఆరోపణలను ప్రభుత్వం దాటవేస్తూనే ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మంగళవారం ట్వీట్‌ చేశారు.

అధికారులను ప్రశ్నిస్తాం : శశిథరూర్‌

పెగాసస్‌ స్పైవేర్‌ దుర్వినియోగం సమాచార సాంకేతిక విభాగ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎంతో ముఖ్యమైన అంశమని ఆ కమిటీ ఛైర్మన్‌ శశిథరూర్‌ పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తామన్నారు. 32 మంది సభ్యులతో కూడిన ఈ స్థాయీ సంఘం బుధవారం సమావేశం కానుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన