కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తే... కొత్త వేరియంట్ల ముప్పు

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:50 IST

కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తే... కొత్త వేరియంట్ల ముప్పు

బ్రిటన్‌ పరిశోధకుల హెచ్చరిక

లండన్‌: కరోనా ఉద్ధృతి అదుపులోకి రాకముందే కొవిడ్‌ ఆంక్షలను సడలించడం వల్ల... ప్రస్తుత వ్యాక్సిన్లకు లొంగని వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని బ్రిటన్‌ పరిశోధకులు హెచ్చరించారు. కొవిడ్‌ ఆంక్షలను సడలించడం వైరస్‌ ఉత్పరివర్తనాలకు ఎలా కారణమవుతుందన్న అంశంపై ఈస్ట్‌ ఆంగ్లియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఇలా ఉద్భవించే కొత్త వేరియంట్లు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని, ముఖ్యంగా చిన్నారులకు, అవయవమార్పిడి చేయించుకున్న వారికి తీవ్ర హాని కలిగిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నార్విచ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ కెవిన్‌ టేలర్‌ ఆధ్వర్యాన ఈ అధ్యయనం సాగింది. ‘‘కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు నెలల తరబడి స్తంభించాయి. ప్రజల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడింది. కొవిడ్‌ టీకాల కారణంగా వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది. కానీ, ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి టీకాలు అందలేదు. ముఖ్యంగా చిన్నారులకు, వైరస్‌ దాడికి అనుకూలమైన వర్గాలకు ఇప్పటివరకూ మహమ్మారి నుంచి ఎలాంటి రక్షణ లేదు. ఈ తరుణంలో ప్రభుత్వాలు కొవిడ్‌ ఆంక్షలను సడలించడం, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతుంది. వైరస్‌ దీర్ఘకాలం కొనసాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సంతరించుకుంటాయి. ఇలా ఉద్భవించే కరోనా కొత్త వేరియంట్లు చిన్నారులకు హాని కలిగించవచ్చు’’ అని టేలర్‌ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన