ఆక్సిజన్‌ ఇచ్చినందుకు కేసు పెడతారా? : దిల్లీ హైకోర్టు

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:26 IST

ఆక్సిజన్‌ ఇచ్చినందుకు కేసు పెడతారా? : దిల్లీ హైకోర్టు

దిల్లీ: కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరా చేసిన ఆప్‌ ఎమ్మెల్యేపై కేసు పెట్టడాన్ని గురువారం దిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వాలు విఫలమయినప్పుడు ఆప్‌ ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌ ముందుకు వచ్చి ఆక్సిజన్‌ అందించారని తెలిపింది. అలా అయితే ఆక్సిజన్‌ సరఫరా చేసిన గురుద్వారాలు, మందిరాలు, సామాజిక సంస్థలపైనా కేసులు పెడతారా అని న్యాయమూర్తులు జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం దిల్లీ డ్రగ్‌ కంట్రోలర్‌ను ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పేందుకు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఆగస్టు అయిదో తేదీకి వాయిదా వేసింది. కరోనా సమయంలో పెద్దయెత్తున మందులు నిల్వ చేసినందుకు భాజపా ఎంపీ గౌతం గంభీర్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని డ్రగ్‌ కంట్రోలర్‌ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. మందులు నిల్వ చేసి పంపిణీ చేయడం వేరు, అవసరం ఉన్నవారికి ఆక్సిజన్‌ అందించడం వేరు అని ధర్మాసనం తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన