టీకాలతో బ్రిటన్‌లో కొవిడ్‌కు అడ్డుకట్ట

ప్రధానాంశాలు

Published : 30/07/2021 06:28 IST

టీకాలతో బ్రిటన్‌లో కొవిడ్‌కు అడ్డుకట్ట

లండన్‌: కరోనా టీకాలు వేయడం కారణంగా బ్రిటన్‌లో సత్ఫలితాలు కనిపించాయి. దీనివల్ల కనీసం 2.20 కోట్ల మందికి వైరస్‌ సోకకుండా అడ్డుకోగలిగారు. 60వేల మరణాలను నివారించగలిగారు. గురువారం పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ (ఐపీఈ) విడుదల చేసిన అధికారిక నివేదికలో ఈ విషయం వెల్లడయింది. గత రెండు వారాల్లో పరిస్థితి బాగా మెరుగయిందని ఆ సంస్థ తెలిపింది. మునుపటి అంచనాలు కన్నా రెట్టింపు ఫలితాలు కనిపించాయని పేర్కొంది. టీకాలు వేసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపారని, ప్రతి ఒక్కరికీ రెండు డోసులు అందేలా చూస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగినట్టు పేర్కొన్నాయి. మళ్లీ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన