పెగాసస్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ

ప్రధానాంశాలు

Published : 31/07/2021 04:59 IST

పెగాసస్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరపడానికి శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌లు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారం పర్యవసానాలు చాలా అధికంగా ఉన్నందున అత్యవసరంగా విచారణ జరపాలంటూ పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ చేసిన వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం అంగీకరించింది. దీనిపై వచ్చే వారం విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ రమణ చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన