Hotline: ఉత్తర సిక్కిం సెక్టార్‌లో చైనాతో హాట్‌లైన్‌

ప్రధానాంశాలు

Updated : 02/08/2021 07:53 IST

Hotline: ఉత్తర సిక్కిం సెక్టార్‌లో చైనాతో హాట్‌లైన్‌

దిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉభయుల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా భారత్‌-చైనా సైన్యాలు ఒక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఉత్తర సిక్కిం సెక్టార్‌లో కొంగ్రాలా వద్ద భారత్‌ వైపు, టిబెట్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ఖంబాజోంగ్‌ వద్ద చైనా వైపు ఈ వ్యవస్థ ఉంటుంది. పరస్పర నమ్మకాన్ని పెంచి, సుహృద్భావ సంబంధాలు తీసుకువచ్చేందుకు హాట్‌లైన్‌ ఉపయోగపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనాకు చెందిన ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (పీఎల్‌ఏ) వ్యవస్థాపక దినోత్సవమైన ఆదివారమే ఈ సేవలు ప్రారంభం కావడం విశేషం.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన