చైనా దన్నుతో పాక్‌ మరో పన్నాగం!

ప్రధానాంశాలు

Published : 02/08/2021 04:52 IST

చైనా దన్నుతో పాక్‌ మరో పన్నాగం!

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్‌ హోదా!
తుది ముసాయిదా సిద్ధం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మరో కుట్రకు శ్రీకారం చుట్టింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్‌(రాష్ట్ర) హోదా ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు కూడా పూర్తయినట్లు పాక్‌ పత్రిక ‘డాన్‌’ పేర్కొంది. ప్రావిన్షియల్‌ హోదాను భారత్‌ ఆది నుంచీ వ్యతిరేకిస్తోంది. చట్ట ప్రకారం జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ కూడా భారత్‌లో అంతర్భాగమేనని పాక్‌కు గతంలో ఎన్నోసార్లు స్పష్టం చేసింది. ఈ ఆక్రమిత ప్రాంతాన్ని అధికారికంగా తన భూభాగంలోకి కలుపుకొనేందుకు కొన్నాళ్లుగా పాక్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుంది. పాక్‌ రాజ్యాంగం పరిధిలోకి వస్తుంది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ విషయంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రత్యేకశ్రద్ద పెట్టారు. సైన్యం సహకారంతో అక్కడి ప్రజలను పాక్‌వైపు మొగ్గేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం భారీగా నిధులు వెచ్చించారు. తాజాగా ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు చెందిన తెహ్రీకీ ఇన్సాఫ్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ ఆలోచన వెనుక చైనా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన