పెంటగాన్‌ సమీపంలో కాల్పులు

ప్రధానాంశాలు

Published : 04/08/2021 05:29 IST

పెంటగాన్‌ సమీపంలో కాల్పులు

పలువురికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన వాషింగ్టన్‌లోని పెంటగాన్‌ మంగళవారం మూతపడింది. చెంతనే ఉన్న మెట్రో బస్‌ స్టేషన్‌లో కాల్పులు జరగడమే ఇందుకు కారణం. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా పలువురికి గాయాలయ్యాయి. మెట్రో బస్‌ ప్లాట్‌ఫామ్‌పైనే దుండగుడు కాల్పులు జరిపినట్టు పెంటగాన్‌ రక్షణ బృందం ట్వీట్‌ చేసింది. కాల్పులపై దర్యాప్తు జరుగుతున్నందున పూర్తి వివరాలు అధికారులు వెల్లడించలేదు. ఘటన అనంతరం ఈ ప్రాంతంలో గాలింపు చర్యల నిమిత్తం పెంటగాన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన