అమెరికాలో మారటోరియం పొడిగింపు

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:24 IST

అమెరికాలో మారటోరియం పొడిగింపు

 అక్టోబరు 3 వరకు అమలు

వాషింగ్టన్‌: కరోనా తీసుకువచ్చిన కష్టాల కారణంగా ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న దాదాపు 36 లక్షల మందికి ఎట్టకేలకు ఊరట లభించింది. వీరిని ఖాళీ చేయించకుండా అడ్డుకునేందుకు ఇదివరకు విధించిన మారటోరియానికి కాలం చెల్లిపోవడంతో కొత్తగా మరో మారటోరియాన్ని ‘వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం’ (సీడీసీ) ప్రకటించింది. ఇది అక్టోబరు 3 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా డెల్టా రకం చెలరేగిపోతున్న నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తున్నవారిని, అద్దెల ఆదాయం లేక ఇబ్బందుల పాలవుతున్న యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దాదాపు 90% జనాభా నివసించే ప్రాంతాలకు నూతన మారటోరియం వర్తిస్తుంది. దీనికి న్యాయపరమైన సమీక్షలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది నిపుణులతోనూ చర్చించాకే సీడీసీ ఈ ఆదేశాలిచ్చిందని అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మారటోరియం పొడిగింపుతో అసాధారణ ఉపశమనం లభించినట్లయిందని స్పీకర్‌ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. అర్థంతరంగా రోడ్డున పడాల్సి వస్తోందనే భయాన్ని లక్షల మందిలో ఇది పోగొట్టగలిగిందని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన