కేంద్ర టీకా షెడ్యూల్‌ను రాష్ట్రమెలా అతిక్రమిస్తుంది?

ప్రధానాంశాలు

Published : 13/08/2021 04:55 IST

కేంద్ర టీకా షెడ్యూల్‌ను రాష్ట్రమెలా అతిక్రమిస్తుంది?

కేరళ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

కొచ్చి: కేంద్రం నిర్ణయించిన కరోనా టీకా షెడ్యూల్‌ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అతిక్రమిస్తుందని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. కొవిషీల్డ్‌ మొదటి, రెండో డోసుల మధ్య విరామాన్ని నాలుగు వారాల నుంచి 12-16 వారాలకు పెంచడానికి కారణమేమిటని జస్టిస్‌ పి.బి.సురేశ్‌కుమార్‌ ధర్మాసనం గురువారం ప్రశ్నించింది. తమ కార్మికులకు కొవిషీల్డ్‌ రెండో డోసు వేసేందుకు అనుమతి కోరుతూ కైటెక్స్‌ గార్మెంట్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విదేశాలకు వెళ్లేవారి కోసం రెండు డోసుల మధ్య విరామాన్ని ఎలా సడలిస్తారని కేరళ సర్కారును ప్రశ్నించింది. మొదట నిర్ణయించిన విరామం 4-6 వారాలేనని కైటెక్స్‌ తరఫు న్యాయవాది తెలిపారు. అలాంటప్పుడు వ్యవధిని ఎందుకు పెంచారో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం సమాధానమివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన