నిబంధనల ఉల్లంఘనపై అధ్యయనం

ప్రధానాంశాలు

Published : 13/08/2021 04:53 IST

నిబంధనల ఉల్లంఘనపై అధ్యయనం

  భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు

  వెంకయ్యనాయుడు, ఓం బిర్లా నిర్ణయం

ఈనాడు, దిల్లీ: పార్లమెంటులో కొందరు సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డుపడిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఇలాంటి విషయాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు నిర్ణయించారు. దీని ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఒక నిర్ణయానికి రావాలని వారిద్దరూ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై అధికార, విపక్షాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో మొత్తం పరిస్థితిని సమీక్షించడానికి గురువారం సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో వారు సమావేశమయ్యారు. పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వినిపించుకోకుండా కొందరు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించడంవల్ల దేశ అత్యున్నత చట్టసభ గౌరవ మర్యాదలకు భంగం కలిగినట్లు ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

సభలో పరిణామాలపై ఆరా

గత కొద్దిరోజులుగా రాజ్యసభలో చోటు చేసుకున్న పరిణామాలు, గతంలో జరిగిన ఇలాంటి ఘటనల గురించి సీనియర్‌ అధికారుల నుంచి వివరాలను ఛైర్మన్‌ విడిగా తెలుసుకున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన