మిశ్రమ డోసులు వద్దు

ప్రధానాంశాలు

Published : 14/08/2021 04:58 IST

మిశ్రమ డోసులు వద్దు

సీరం సంస్థ అధిపతి పూనావాలా వ్యాఖ్య

పుణె: కొవిడ్‌-19 నుంచి మెరుగైన రక్షణ కోసం రెండు భిన్న కంపెనీల టీకా డోసులను ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా పేర్కొన్నారు. సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ను, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాల మిశ్రమం వల్ల మెరుగైన రోగ నిరోధక రక్షణ లభిస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పూనావాలా ఈ మేరకు స్పందించారు. ‘‘మిశ్రమ డోసులు ఇచ్చినప్పుడు సానుకూల ఫలితాలు రాకుంటే.. రెండు టీకా సంస్థల మధ్య పరస్పర నిందారోపణలకు దారితీసే అవకాశం ఉంటుంది. పైగా ఈ విధాన సమర్థతను ఇంకా నిర్ధరించలేదు’’ అని పేర్కొన్నారు. కొవిడ్‌ టీకాల ఎగుమతిపై నిషేధం విధించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సైరస్‌ పూనావాలా వ్యాఖ్యానించారు. దీనివల్ల తమ సంస్థ.. ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. అయితే దీనిపై నోరు మెదపవద్దని తన కుమారుడు, సీరం సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా తనకు సూచించారని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య రెండు నెలల విరామం శ్రేయస్కరమని సైరస్‌ పేర్కొన్నారు. అయితే ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు అవసరమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన