పెగాసస్‌పై బెంగాల్‌ దర్యాప్తా?

ప్రధానాంశాలు

Updated : 19/08/2021 07:54 IST

పెగాసస్‌పై బెంగాల్‌ దర్యాప్తా?

సుప్రీంకోర్టులో వ్యాజ్యం

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుండడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలయింది. మొత్తం దేశానికి సంబంధించిన ఈ అంశంపై ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏం పరిధి ఉంటుందని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ఆ దర్యాప్తు సంఘం ఇప్పటికే రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించిందని, దీన్ని నిలిపివేయించాలని కోరారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ బుధవారం కేంద్రానికి, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయ్‌ భట్టాచార్య ఆధ్వర్యంలో గత నెలలో ఈ దర్యాప్తు సంఘం ఏర్పాటు కావడం గమనార్హం. 

కేంద్రం ఒప్పుకొన్నట్టే: చిదంబరం

దేశ భద్రత దృష్ట్యా స్పైవేర్‌ సమాచారాన్ని వెల్లడించలేమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని చూస్తుంటే దాన్ని ఉపయోగించారని అర్థమవుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన