నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్‌మహల్‌ వీక్షణ

ప్రధానాంశాలు

Published : 21/08/2021 05:43 IST

నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్‌మహల్‌ వీక్షణ

రాత్రి సందర్శనకు అనుమతి

ఆగ్రా: నేటి నుంచి మళ్లీ తాజ్‌మహల్‌ అందాలను వెన్నెల వెలుగుల్లో ఆస్వాదించొచ్చు. దీన్ని రాత్రి వేళ్లలో వీక్షించడానికి సందర్శకులను శనివారం నుంచి అనుమతించనున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చిలో రాత్రివేళల్లో తాజ్‌మహల్‌ సందర్శనను ఆపేశారు. దాదాపు 17 నెలల తర్వాత మళ్లీ ఆ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈమేరకు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రతి వారంలో శుక్ర, ఆదివారాలు మినహా తాజ్‌మహల్‌ రాత్రి సందర్శన ఉంటుందని చెప్పారు. రాత్రి 8:30-9:00, 9:00-9:30, 9:30-10:00 గంటల వ్యవధిలో 3 స్లాట్లు ఉంటాయని, ఒక్కో స్లాటులో 50 మంది పర్యాటకులను అనుమతిస్తామని తెలిపారు. సందర్శనకు ఒక్క రోజు ముందు ఆగ్రాలోని ఏఎస్‌ఐ కార్యాలయంలో టికెట్లు తీసుకోవాలన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన