సెప్టెంబరుకల్లా అందుబాటులోకి జైకోవ్‌-డి వ్యాక్సిన్‌

ప్రధానాంశాలు

Published : 22/08/2021 05:53 IST

సెప్టెంబరుకల్లా అందుబాటులోకి జైకోవ్‌-డి వ్యాక్సిన్‌

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డి’ వ్యాక్సిన్‌ సెప్టెంబరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టీకాకు శుక్రవారం భారత ఔషధ నియంత్రణమండలి (డీజీసీఏ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ధర, సరఫరా విషయంలో నియంత్రణాధికారులతో కలిసి పనిచేస్తున్నాం. వచ్చే రెండు వారాల్లో ధరపై స్పష్టత వస్తుంది’’ అని జైడస్‌ గ్రూప్‌ ఎండీ షార్విల్‌ పటేల్‌ తెలిపారు. సెప్టెంబరు చివరికల్లా టీకాల సరఫరా ఆరంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబరుకల్లా కోటి డోసుల సామర్థ్యానికి చేరుకుంటామని, జనవరి ఆఖరికల్లా దీన్ని ఐదు కోట్లకు పెంచుతామని చెప్పారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన