ఏడాది తర్వాతే కులాలవారీ జనగణనపై నిర్ణయం!

ప్రధానాంశాలు

Published : 22/08/2021 05:53 IST

ఏడాది తర్వాతే కులాలవారీ జనగణనపై నిర్ణయం!

2021 జనగణన తర్వాతే దృష్టి సారించనున్న కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశంలో కులాలవారీగా జనాభాను లెక్కించాలంటూ విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఓ ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కలు (సెన్సస్‌) పూర్తి చేయడంపైనే దృష్టి సారించింది.

దేశంలో ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ 2020లో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా బాగా ఆలస్యమైంది. ఈలోపు భాజపాలోని ఓబీసీ లాబీతో పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి సైతం కులాల వారీగా జనాభా లెక్కలు తేల్చాలంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇటీవల పార్లమెంట్‌లో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలోనూ దాదాపుగా అన్ని పార్టీలు ఇదే డిమాండ్‌ వినిపించాయి. అయితే 2021 జనగణన కోసం ఇంటింటికీ తిరిగి సేకరించే ప్రశ్నావళి ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే మూడు విభాగాలే ఉన్నాయి. ఇతరులు.. ఏ కులమో తెలిపే కాలమ్‌ లేదు. అంటే 2011 జనగణన నమూనానే ఇప్పుడూ అమలుచేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది. సామాజిక, ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ)ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టేనని కేంద్రంలోని ఓ అధికారి తెలిపారు. ఇదే సమయంలో ఈఏడాది చేపట్టే జనాభా లెక్కల సేకరణలో గుర్తించదగిన మార్పు ఒకటి ఉంది. అదే యాప్‌ వినియోగం. దీని ద్వారా వివరాల సేకరణ మరింత సులువు కానుంది. మునుపటిలాగే సిబ్బంది ప్రతి గడపకూ తిరుగుతారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన