మళ్లీ బందీలైపోయాం

ప్రధానాంశాలు

Published : 22/08/2021 05:53 IST

మళ్లీ బందీలైపోయాం

హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీకి అఫ్గాన్‌ యువతి లేఖ

లాస్‌ఏంజెలెస్‌: ‘‘నేనొక అఫ్గాన్‌ యువతిని. తాలిబన్లు రాకముందు మేమంతా ఉద్యోగాలు చేసుకొనేవాళ్లం. పాఠశాలలకు వెళ్లేవాళ్లం. మాకు హక్కులు ఉండేవి. తాలిబన్లరాకతో అంతా మారిపోయింది. వారిని చూసి భయపడుతున్నాం. మా కలలన్నీ కల్లలయ్యాయి. హక్కులు కోల్పోయాం. బయటికి రాలేని పరిస్థితి. చదువులు, ఉద్యోగాల సంగతి చెప్పక్కర్లేదు. తాలిబన్లు మారారని కొందరు చెబుతున్నారు. నేనలా భావించడం లేదు. ఇప్పుడు మా జీవితాలు చీకటిమయమయ్యాయి. స్వేచ్ఛను కోల్పోయాం. మళ్లీ మేం బందీలైపోయాం’’

ఇదీ హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీకి ఓ అఫ్గాన్‌ యువతి రాసిన లేఖ. దీన్ని ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటివరకు జోలీ.. ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ఖాతా తెరవలేదు. అయితే అఫ్గాన్‌ ప్రజల వెతలను చాటిచెప్పేందుకే తాను ఈ ఖాతాను తెరిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక నుంచి ఆ దేశ ప్రజల బాధలను ప్రపంచంతో పంచుకుంటానని, వారికి సహాయం చేయడానికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన